![]() |

సర్కార్ లేటెస్ట్ ఎపిసోడ్ అంతా క్రికెట్ కామెంటేటర్లు ఫుల్ సందడి చేశారు. ఈ ఎపిసోడ్ కి ఒకప్పుడు క్రికెటర్, మాజీ సెలెక్టర్, ఇప్పుడు కామెంటేటర్ గా ఎంఎస్కె. ప్రసాద్ వచ్చారు. ఆయన చాల విషయాలు షేర్ చేసుకున్నారు. "సుధీర్ మనం గొప్ప గొప్ప క్రికెటర్స్ ని టీవీల్లో, వేరే వేదికల మీద బిల్ బోర్డ్స్ మీద చూస్తూ ఉంటాం. సచిన్, సౌరవ్, రాహుల్, లక్ష్మన్ ఇలా వాళ్ళను కలిసి నప్పుడే తెలుస్తుంది సింప్లిసిటీ అంటే ఏమిటో. 1999 లో అనుకుంటా మలేషియాలో ఉన్నాం. ఒక రోజు సాయంత్రం సచిన్ నుంచి కాల్ వచ్చింది. ఆయన గొంతు మనకు తెలుసు కదా. నన్ను గుంటూరు ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు. గుంటూరు ఎక్స్ప్రెస్ ఎక్కడ అని అడిగారు ఫోన్ లో. సచిన్ ఫోన్ చేసినప్పుడు జవగళ్ శ్రీనాథ్ ఉన్నారు. ఆయన భలే కొంటెవాడు. ఎలా అంటే అమ్మాయిల గొంతులతో పిలిచి కింద రిసెప్షన్ లో ఉన్నాను రమ్మని ఆటపట్టించేవాడు. ప్రాంక్ కాల్స్ చాలా చేసేవాడు.
నేను అలాంటి కాల్ ఏమో అనుకున్నా. కానీ సచిన్ ఫోన్ చేశారు. డిన్నర్ కి వెళదాం 7 .45 కి రమ్మన్నాడు. నేను 7 .35 కి వెళ్ళా. అప్పటికే అక్కడ సచిన్ అటు ఇటు చూస్తూ ఉన్నాడు. నేను అడిగా. సచిన్ సారీ నిన్నేమన్నా వెయిట్ చేయించానా అన్నా.. లేదు నేను ప్రతీ సందర్భంలో 20 నిమిషాలు ముందే ఉంటాను అని చెప్పాడు. అతని ఆలోచనా విధానం ముందస్తుగా ఉంటుందేమో కాబట్టే బాల్ ని ముందుగానే చూడగలుతాడేమో అనిపిస్తుంది. సచిన్ డిఎన్ఏ లోనే అది ఉందేమో. అదే నేను సచిన్ దగ్గర నేర్చుకున్న మొదటి పాఠం. తర్వాత పద వెళదాం డిన్నర్ కి అన్నాడు. నేను అటు ఇటు చూస్తున్నా. ఏంటి చూస్తున్నావ్ అన్నాడు. సచిన్ ఇంతమందికి ఇన్ని కార్ లు వచ్చాయి నీకే కార్ వస్తుంది అని అడిగా. ఏ నడవలేవా అన్నాడు.
చిన్నపిల్లాడు నడిచినట్టు ఐదారు కిలోమీటర్లు నడిచేసాడు. నేను అతన్ని ఒక ప్రశ్న అడిగా. నువ్వు చిన్నపిల్లాడు నడిచినట్టు నడిచావు. నువ్వు ఇదంతా ఇండియాలో మిస్సవుతున్నావా అన్నాను. అప్పుడు అతను ఒక్కటే అన్నాడు. క్రికెట్ అంటే ఒక మతం. క్రికెటర్స్ ని దేవుళ్ళులా అభిమానిస్తారు ఇండియాలో. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు చక్కగా ఉపయోగించుకుని ఎంజాయ్ చేయాలి అన్నాడు. సింప్లిసిటీలోనే ఉంటుంది ఏదైనా అని తెలుసుకున్నా " అని చెప్పారు ఎంఎస్కె. ప్రసాద్.
![]() |